రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.