భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2024 లో భాగంగా వేములవాడ రూరల్ మండల కేంద్రములోని చెక్కపల్లి గ్రామంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి డా. చెన్నమనేని వికాస్ దీపలు హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. మోది భారత దేశాన్ని విశ్వగురు చేయాలనీ తపనతో ముందుకు నడుస్తున్నారన్నారు.