పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం రామగిరి మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద నిర్మించిన డైనింగ్ హాల్ వినియోగించకపోవడం గమనించిన కలెక్టర్ కారణాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పాఠశాల హెచ్ఎం మేరీ పాల్గొన్నారు.