అధికారులు, సిబ్బందిలో ప్రతిభ గుర్తింపుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు పాల్గొన్నారు.