విద్యా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవన నిర్మాణ కోసం అధికారులతో పర్యవేక్షించారు. విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ చిత్త శుద్ధితో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, ప్రిన్సిపాల్స్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.