బతుకమ్మ, దసరా వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలో బతుకమ్మ వేడుకలు, పంచాయతీ విధులపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో వేడుకలు ఘనంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పాల్గొన్నారు.