వరంగల్ నార్త్ జోన్ పరిధిలో 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాల పట్టణ సిఐ ముత్తి లింగయ్య, రామగుండం లీగల్ సెల్ కు, లక్షేట్టిపేట సీఐ నారాయణ నాయక్, మంచిర్యాల టౌన్ కు బదిలీ అయ్యారు. అలాగే శ్రీరాంపూర్ సీఐ సంజీవ్, మంచిర్యాల రూరల్ కు, మంచిర్యాల ట్రాఫిక్ సిఐ రాజు శ్రీరాంపూర్ కు, నిర్మల్ సీసీఎస్ సీఐ నరేష్ కుమార్, మంచిర్యాల ట్రాఫిక్ కు, మంచిర్యాల రురల్ సీఐ కుమారస్వామి నిర్మల్ సీసీఎస్ కు, లక్షేట్టిపేట సీఐగా కరీం ఉల్లాఖాన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు నార్త్ జోన్ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.