ధాన్యం కొనుగోలు కేంద్రం షురూ
తిమ్మాపూర్ మండలం రేణికుంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ కలిసి మనకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతులు పండించిన వరి ధాన్యాన్ని రూ. 2320 మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.