కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగంపేట గ్రామ పంచాయతీ సమీపంలోని బావిలో వెల్ది గ్రామానికి చెందిన యువకుడి మృతదేహం లభ్యం అయింది. కాగా బావిలో శవమై కనిపించిన యువకుడిది ఆత్మహత్యనా, హత్యనా అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బావిలో నుంచి యువకుడి డెడ్ బాడీని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆదివారం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.