ఏపీలో లాసెట్ ప్రవేశాల షెడ్యూల్‌ను నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య గంగాధర్ విడుదల చేశారు. లాసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 16 నుంచి 20 లోపు రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ చేయించుకోవాలన్నారు. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 26న మార్పులు, 28న సీట్లు కేటాయిస్తామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 29, 30 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు.