మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పొత్తూరులో ఆదివారం రెడ్డి సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రెడ్డి సంఘం అధ్యక్షులు భూంపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక రెడ్డి సభ్యులు సంఘం అభివృద్ధికి పాటు పడాలని ప్రతి సభ్యులు అందరు ఊరు అభివృద్ధికి తొడ్పాటు చేయాలన్నారు. ప్రతి ఎలక్షన్స్ లో మన వంతు ఎక్కువ ఉండాలని చెప్పారు.