గొల్లపల్లి మండలంలోని శ్రీ రాముల పల్లె గ్రామంలో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళం గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. శివాజీ మహారాజ్ కు పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రజలందరికీ స్వీట్లు పంపిణీ చేసి శివాజీ మహారాజు చరిత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.