పండుగలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే

50பார்த்தது
పండుగలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే
వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేసారి వస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నారు. జహీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రెండు పండుగలు ప్రశాంతంగా జరుపుకునేలా చూడాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో రాజు, డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி