ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈరోజు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారని చిగురుమామిడి మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి అన్నారు. శనివారం చిగురుమామిడి మండల కేంద్రంలో
కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు పోలు స్వప్న తోరణాలతో బస్సును అలంకరించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాని ప్రారంభించి మహిళలకు మిఠాయిలు పంచిపెట్టారు.