కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధరను పొందాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కోరారు. కొండపాక మండల పరిధిలోని రాంపల్లిలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడుతూ ఆరుగాలం కష్టించిన ధాన్యం దళారులకు అమ్ముకుని నష్టపోవద్దన్నారు. ధాన్యం అమ్ముకోవడానికి ఆయా గ్రామాల ఏఈఓల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు.