రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీఐ సైదా అన్నారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిమ్మనగూడ, సురభి కళాశాల చౌరస్తా, పాతూరు జంక్షన్, క్యాసారం రింగురోడ్డు వరకు రాజీవ్ రహదారిపై ఉన్న పలు ప్రమాద ప్రాంతాలను ఆర్అండ్ బీ డీఈ వెంకటేశ్వర్రావు, హెచ్కీఆర్ హైవే అథారిటీ ప్రతినిధితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.