కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

65பார்த்தது
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని దళారులను నమ్మి మోసపోవద్దని దౌల్తాబాద్ ఐకెపి ఎపిఎం  యాదగిరి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్  గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా  ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. కావున రైతులు దళారుల నమ్మి మోసపోకుండా  ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி