పాదయాత్ర విజయవంతం చేయండి
దళితులంతా ఐక్యమత్యంతో రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడాలని వర్గీకరణ పేరుతో విభజించబడుద్దని తెలంగాణ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మండల యాదగిరి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో
మాలల మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నేతృత్వంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యం చేస్తూ దళితులను ఏకం చేయడమే లక్ష్యంగా మహా పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు.