సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆర్యవైశ్య సంఘం భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ 15 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి సామూహిక అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని, గర్భాలయాన్ని 11 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి మాతగా అలంకరించి పూజలు చేశారు. అర్చనల అనంతరం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.