దౌల్తాబాద్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెడుతుందని దౌల్తాబాద్ ఏపీఎం యాదగిరి అన్నారు. ఆయన మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలంలో మహిళ సంఘాల సభ్యులకు 1450 'అసిలి జాతి నాటు కోడి పిల్లల పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళ సంఘ సభ్యులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడం కోసం నాటు పెరటి కోళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.