కొలరాడో(US) ఫ్రూటాలో 1945లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఒల్సేన్ తన దగ్గరున్న కోడి మెడను కట్ చేశాడు. అది అతని దగ్గర నుంచి పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే బతికే ఉంది. ఓ బాక్స్‌లో పెట్టి ఐడ్రాపర్‌ని ఉపయోగించి ఆహారం ఇచ్చాడు. కోళ్లకు తల వెనుక భాగంలో మెదడు ఉంటుంది. ఆ పార్ట్ కట్ కాకపోవడంతో కోడి బతికింది. అయితే రెండేళ్ల బతికి 1947లో మృతి చెందింది.