సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కార్యవర్గాన్ని జహీరాబాద్ పట్టణంలోని బసవ ఫంక్షన్ హాల్ లో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఇప్పపల్లి నర్సింలు ప్రధాన కార్యదర్శిగా కొంక రాజేశ్వర్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని వీరశైవ లింగాయత్ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.