ప్రథమ చికిత్స పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని గణపతి పరిశ్రమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె వి ఆర్ కె యుగంధర్ అన్నారు. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులో ఉన్న గణపతి చక్కెర పరిశ్రమలో శనివారం ఎస్టీ జాన్ అంబులెన్సు సంస్థ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై ఉద్యోగులకు అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హఠాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రథమ చికిత్సపై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయన్నారు.