విజయదశమి పండగ పూర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం రాయికోడ్ మండలం కుసునూరు గ్రామ ప్రజలకు గ్రామ పార్టీ అధ్యక్షులు దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగ తర్వాత వచ్చే సంప్రదాయక పండగ దసరా అని అన్నారు. ప్రజలందరికీ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.