జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో అస్వస్థకు గురైన 6, 7, 8 తరగతుల విద్యార్థినిలను పరామర్శించారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను వారి ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి.