సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 22వ తేదీన వికలాంగులకు సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి గురువారం తెలిపారు. శిబిరానికి సంబంధించిన స్లాట్స్ ఈనెల 15వ తేదీన కేటాయిస్తామని పేర్కొన్నారు. అన్ని వివరాలతో వికలాంగులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పారు.