ఎక్కడైనా బాల కార్మికులను పెట్టుకుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఐటిఐ సమీపంలోని న్యాక్ కేంద్రంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ లేబర్ అధికారులు యాదయ్య, నీరజ, న్యాక్ డైరెక్టర్ రాము పాల్గొన్నారు.