సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ 11వ వార్డు బీరప్ప బస్తీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాజీ వార్డు సభ్యురాలు శారద సంతోషం వ్యక్తం చేశారు. బస్తీలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆమె స్థానికులతో కలిసి గురువారం పరిశీలించారు. కాలనీ నుంచి కొత్త బస్టాండ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నయన్నారు. బస్తీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.