నారాయణఖేడ్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలు ఆదివారం చోరీకి గురైయ్యాయి. నాగల్ గిద్ద మండలం ఎనక్ పల్లికి చెందిన నిర్మల కుటుంబీకులతో కొన్నేళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటుంది. ఉజలంపాడ్ బంధువుల ఇంటికి విందుకు వచ్చి నారాయణఖేడ్ రాజీవ్ కూడలిలో బస్సు ఎక్కుతుండగా బ్యాగ్ నుంచి 6. 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ జరగడంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.