నాగల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామంలో సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. స్థానిక పాలన, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చర్చించారు. పంచాయతీ కార్యదర్శి కిస్టోఫర్ మాట్లాడుతు గ్రామనికి అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తూ గ్రామంలో ఎప్పటికప్పుడు భావనలు, రోడ్లు, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.