2024-25 సంవత్సరానికి ఇన్ ఇన్‌స్పైర్-మనక్ కు జిల్లా నుంచి 783 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను డివిజన్ ఆర్పీలు జిల్లా సైన్స్ కేంద్రంలో వెంటనే అందించేలా చూడాలని సూచించారు. వీరిలో ఎంపికైన విద్యార్థులకు ప్రయోగం తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 10 వేలు రూపాయలు అందిస్తుందని పేర్కొన్నారు.