ఉగాది పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మార్కండేయ దేవాలయంలో పంచాంగశ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభకృత్ నామ సంవత్సరం పంచాంగాన్ని వేద పండితులు శీలం కోట నారాయణ చారి పఠించారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న విషయాలను తెలియజేశారు. ఈ ఏడాది చిరు ధాన్యాలకు మంచి గిరాకీ లభిస్తుందన్నారు. గోవులను సంరక్షణ చేయాలని అన్నారు. అలాగే పంటలు బాగా పండి రైతులకు మోక్షం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.