మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఈనెల 7 తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుడి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఈర్ల అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవ కార్యక్రమములు 7వ తేదీ శుక్రవారం పోలేరమ్మ దేవతకు భోనాలు. 8వ శనివారం పోచమ్మ దేవతకు భోనాలు, 9వ ఆదివారం దుర్గమ్మ దేవతకు భోనాలు, 10వ సోమవారం బేతాళ స్వామి వారికి భోనాలు, 11వ మంగళవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ బేతాళ స్వామి బండ్లు తిరుగును, 12వ బుధవారం భజనలు, 13వ గురువారం భాగోతములు, 14వ శుక్రవారం వినోద కార్యక్రమములు జరుగును అని, 15వ శనివారం ఉదయం 8గంటలకు స్వామి వారి పాటిబండ్ల తిరుగును అని ఆలయ అధికారులు తెలిపారు.