సంగారెడ్డి, హత్నూరలో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. హత్నూర ఐటిఐ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.