తెలంగాణలోని నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ సమీపంలో ఉప్పుటేరు వాగు దగ్గర ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.