TG: నిరుపేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంటి నిర్మాణానికి డబ్బులు పెట్టుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇళ్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన 850 లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ముందు రుణాలను మంజూరు చేయాలన్నారు.