టాటా గ్రూప్ అనేది ఆర్థిక రంగం నుంచి ఉక్కు పరిశ్రమ వరకు విస్తరించిన ఒక ప్రముఖ సంస్థ. అయితే రతన్ టాటా గ్రూప్‌లో ఏదైనా కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు.. దానిని వదిలించుకుందామని బోర్డు మెంబర్స్ చెప్పినా ఆయన ససేమిరా ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే ఆ కంపెనీలపై ఆధారపడిన ఉద్యోగుల జీవితాలు రోడ్డుపైన పడతాయని ఆలోచించేవాడు. నష్టాల్లో ఉన్న కంపెనీ ఉద్యోగులను వేరే గ్రూప్‌నకు పంపించేవారు. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు.