దుందుభి నదిలో అరుదైన చేపలు!

84பார்த்தது
దుందుభి నదిలో అరుదైన చేపలు!
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు అరుదైన చేపలు చిక్కాయి. కృష్ణా ఉపనది అయిన దుందుభి నదిలో వేటకు వెళ్లిన ఓ జాలరికి రెండు అరుదైన చేపలు దొరికాయి. చీమర్ల మణిందర్ అనే జాలరి వలకు రెండు అరుదైన చేపలు చిక్కాయి. వాటిలో ఒకటి పాము ఆకారంలో ఉండగా.. మరొకటి శరీరంపై మచ్చలు, మచ్చలుగా కనిపించింది. పాము ఆకారంలో ఉన్న మలగమేను కాగా.. మరొకటి చెన్నై మెరీనా బీచ్‌లో కనిపించే డెవిల్ ఫిష్‌గా గుర్తించారు. వీటి విలువ చాలా ఎక్కువ ఉంటుంద‌ని స‌మాచారం.

தொடர்புடைய செய்தி