రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. ఆయన నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని గురువారం అన్నారు. విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు.