ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను కారుతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే రామంతాపూర్ కు చెందిన చంద్రమౌళి నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రియల్ ఎస్టేట్ డైరెక్టర్గా ఆఫీస్ నడుపుతున్నాడు. అదే ఆఫీస్ లో ఓ మహిళ ఉద్యోగం చేస్తుంది. చంద్రమౌళికి ఆ మహిళతో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో వ్యక్తితో ఆ మహిళ సన్నిహితంగా ఉందని చంద్రమౌళి అనుమానంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఉప్పల్ భగయత్కి తీసుకవచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు.