తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తంకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.