షాద్ నగర్ మ్యగ్న ప్రైవేట్ ఆస్పత్రి యజమాని డాక్టర్ కె. లాల్ కుమార్ ఆకస్మిక మృతి పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ లాల్ కుమార్ మృతి తీరనిలోటని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.