ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. షాద్ నగర్ పట్టణంలోని స్వగృహంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన గందే సురేష్ ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు.