తెలంగాణలో ప్రతిపక్షాల గొంతును నొక్కడం అన్యాయమని, ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.