ఎన్నికలకు ముందు 15వేలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ప్రస్తుతం చేతులు ఎత్తడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులకు భరోసా పోయిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు పాత జాతీయ రహదారి పక్కన రైతు భరోసా ఎత్తివేతపై ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.