షాద్నగర్ పట్టణ కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు తన ప్రసంగంతో అలరించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా చేయని పనిని తమ్ముడు శంకర్ చేయడం సంతోషంగా ఉందన్నారు. నావల్ల కాదు అనుకుంటే ఏదీ జరగదని.. ప్రయత్నం చేస్తే అన్ని సఫలం అవుతాయని పేర్కొన్నారు. ఒక పేదవాడిగా చదువుకోవడానికి తాను పడ్డ ఇబ్బందుల గురించి తెలిపారు.