షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల పరిధిలోని పాడైన రోడ్డు మరుమత్తులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం & సీఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కేశంపేట్ మండల తహసిల్దార్ కి విన్నవించినట్టు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ శ్రీను నాయక్ మరియు సీఐటియు మండల కన్వీనర్ బేరి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.