షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు పాత జాతీయ రహదారి పక్కన రైతు భరోసా ఎత్తివేతపై ఆదివారం ధర్నా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఈ ఆందోళన కార్యక్రమం ఉండడంతో పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతు భరోసా కోసం ఎదురుచూస్తూ రైతులు అప్పులు చేసి ఆగమయ్యారని విమర్శించారు.