షాద్ నగర్ పట్టణంలో ప్రజలకు ఆర్థిక భద్రత కరువైందని కేవలం సీసీ కెమెరాలు పనిచేయకపోతే దొంగతనాలను పసిగట్టడంలో పోలీసులు విఫలం చెందుతున్నారని మంగళవారం షాద్ నగర్ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న చోరీలపై ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇన్స్పెక్టర్ పిడి నాయుడుతో మాట్లాడడం జరిగిందన్నారు. ఇప్పటికైనా బాధితుల ఆవేదనను అర్థం చేసుకొని వీటిపై ప్రత్యేక సాధించాల్సిన అవసరం ఉందన్నారు.