ప్రియుడే సర్వస్వమని భావించింది. అతడితోనే లోకమనుకుంది. కానీ అతడు తనను క్రమక్రమంగా నిర్లక్ష్యం చేయడాన్ని ఆమె భరించలేక పోయింది. ఆ క్రమంలో ఫోన్ చేసినా అతడు తనతో సరిగ్గా మాట్లాడడం లేదని ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురయ్యింది. దీంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.